బడి పిల్లలకు సాయం అందించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-13T05:58:21+05:30 IST

బడి పిల్లలకు అంతా సాయం చేయాలని, కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకులు నోట్‌పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్సులో వేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి కోరారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్సును ఆమె శుక్రవారం పరిశీలించి మాట్లాడారు.

బడి పిల్లలకు సాయం అందించాలి : కలెక్టర్‌
డ్రా్‌ప బాక్స్‌లో నోట్‌పుస్తకాలు వేస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

కలెక్టరేట్‌లో డ్రాప్‌ బాక్స్‌ ఏర్పాటు

భువనగిరి రూరల్‌, ఆగస్టు 12: బడి పిల్లలకు అంతా సాయం చేయాలని, కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకులు నోట్‌పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్సులో వేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి కోరారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్సును ఆమె శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. పుస్తకాలు, పెన్సులు, బ్యాగులు ఇతర వస్తువులు డ్రాప్‌ బాక్సులో వేస్తే వాటిని పిల్లలకు అందజేస్తామన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో నారాయణరెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌, డీపీవో సునంద, ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితి, ఉద్యానశాఖ జిల్లా అధికారి అన్నపూర్ణ ఉన్నారు.

మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి: వినాయ చవితి, నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కలెక్టర్‌ పమేలా సత్పథి ఒక ప్రకటనలో కోరారు. మట్టి విగ్రహాల తయారీకి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే రకమైన వినాయక విగ్రహాలు కాకుండా పలు ఆకృతులతో విగ్రహాలను మట్టితో తయారుచేయిస్తున్నట్టు తెలిపారు. అందమైన మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించాలని కోరారు. 

Updated Date - 2022-08-13T05:58:21+05:30 IST