గిరిజనులకు అండదండలు

ABN , First Publish Date - 2020-12-04T04:28:11+05:30 IST

గిరిజనులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. దుగ్గేరు గిరిజన గ్రామంలో గురువారం పర్యటించిన ఆమె.. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశ్వసనీయతకు, విధేయతకు గిరిజనులు మారుపేరని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు.

గిరిజనులకు అండదండలు
బాగుజోలలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎస్పీ రాజకుమారి

ఎస్పీ రాజకుమారి

మక్కువ, డిసెంబరు 3 : గిరిజనులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. దుగ్గేరు గిరిజన గ్రామంలో గురువారం పర్యటించిన ఆమె.. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశ్వసనీయతకు, విధేయతకు గిరిజనులు మారుపేరని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని.. ఉద్యోగస్తులుగా స్థిరపడేలా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు, పాదరక్షలు, మందులను పంపిణీ చేశారు. అంతకుముందు యర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో మెగా వాలీబాల్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రారంభించి... యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆమె వెంట ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, డీఎస్పీలు ఎల్‌.శేషాద్రి, సుభాష్‌, సాలూరు సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐలు కె.రాజేష్‌, పి.దినకర్‌లు ఉన్నారు. అంతకుముందు ఎస్పీ రాజకుమారి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాగుజోల, దిగువ మెండంగి గ్రామాల్లో వృద్ధులు, గిరిజనులను ఆప్యాయంగా పలకరించి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ పర్యటించిన నేపథ్యంలో ప్రత్యేక బలగాలు మరింత నిఘా పెట్టాయి.


Updated Date - 2020-12-04T04:28:11+05:30 IST