IPS ఆఫీసరే నా కూతురికి రాత్రిళ్లు ఫోన్ చేసి వేధిస్తున్నాడు.. కాపాడండి సార్.. అంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తండ్రి..

ABN , First Publish Date - 2021-07-31T20:08:25+05:30 IST

`ముఖ్యమంత్రిగారూ.. నా కూతురిని కాపాడండి.. ఓ ఐపీఎస్ అధికారి నా కూతురికి రాత్రిళ్లు ఫోన్ చేసి వేధిస్తున్నాడు`.. అంటూ ఓ తండ్రి ట్విటర్ ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేశాడు

IPS ఆఫీసరే నా కూతురికి రాత్రిళ్లు ఫోన్ చేసి వేధిస్తున్నాడు.. కాపాడండి సార్.. అంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తండ్రి..

`ముఖ్యమంత్రిగారూ.. నా కూతురిని కాపాడండి.. ఓ ఐపీఎస్ అధికారి నా కూతురికి రాత్రిళ్లు ఫోన్ చేసి వేధిస్తున్నాడు`.. అంటూ ఓ తండ్రి ట్విటర్ ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేశాడు. సదరు అధికారి పేరు, హోదా, పూర్తి వివరాలను జతచేసి ఆయన ఆ ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు, కేంద్ర హోం శాఖ మంత్రి ఆమిత్ షా, యూపీ డీజీపీ ముకుల్ గోయల్, ఐపీఎస్, ఐఎఎస్ అధికారుల సంఘాలను కూడా తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. 


దీంతో ఈ ట్వీట్ యూపీ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదుపై డీజీపీ ముకుల్ తక్షణమే స్పందించారు. ఈ కేసును ఏడీజీ అజయ్ ఆనంద్‌కు అప్పగించారు. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి అత్యంత అవినీతిపరుడని, యూపీ పోలీస్ శాఖలో సీనియర్ అధికారి అని తెలుస్తోంది. కాగా, ఇలాంటి ఫిర్యాదులు తరచుగా వస్తున్న నేపథ్యంలో యూపీ పోలీసులకు స్పెషల్ వర్క్‌షాప్స్ నిర్వహించాలని డీజీపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-07-31T20:08:25+05:30 IST