కోడి కోసం వెళ్లి చిరుత మృతి

Published: Fri, 13 May 2022 10:21:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోడి కోసం వెళ్లి చిరుత మృతి

ప్యారీస్‌(చెన్నై): కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చి నియోజకవర్గం వాల్పారై ప్రాంతంలో కోళ్ల కోసం వెళ్లిన చిరుతపులి బోనులో చిక్కుకునిమరణించింది. వాల్పారై ప్రాంతానికి చెందిన ఉస్మాన్‌ కోళ్లు పెంచుకుంటున్నాడు. కోళ్ల కోసం ఇంటి వెనుక పెద్ద ఇనుప బోను ఏర్పాటుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఓ చిరుత కాలు బోనులో చిక్కుకొని మృతిచెంది పడివుండడాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచార మిచ్చారు అటవీ సిబ్బంది అక్కడకు చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.