కళ్ల ముందే ఒకరు చనిపోవడం చూసి ప్రసవం గురించి భయం... అబార్షన్ మాత్రలు వేసుకున్న 8 నెలల గర్భవతి.. చివరకు...

ABN , First Publish Date - 2021-09-29T14:29:16+05:30 IST

క్షేమంగా పురుడు పోసుకోవడం మహిళకు మరో జన్మలాంటిదంటారు.

కళ్ల ముందే ఒకరు చనిపోవడం చూసి ప్రసవం గురించి భయం... అబార్షన్ మాత్రలు వేసుకున్న 8 నెలల గర్భవతి.. చివరకు...

క్షేమంగా పురుడు పోసుకోవడం మహిళకు మరో జన్మలాంటిదంటారు. అయితే డెలివరీ విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. వీటిని గుర్తుచేసుకుని కొందరు గర్భిణులు ఆందోళనకు లోనవుతుంటారు. ఇదేకోవలో చెన్నైకి చెందిన ఎనిమిది నెలల గర్భిణి అబర్షన్ చేసుకునేందుకు మందులు మింగడంతో మృతి చెందింది. డెలివరీకి సంబంధించిన భయాలు, అపోహలు వెంటాడుతుండటంతో ఆమె అబార్షన్‌కు ప్రయత్నించి మృత్యువాత పడింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. 23 ఏళ్ల కుమారి కంజాకమ్ ఒడిశాకు చెందిన మహిళ. అయితే ఆమె తన భర్త ప్రతాప్ ఉలాక్, మేనకోడలు గీతా కంజాకాలతో పాటు చెన్నైలో ఉంటోంది.


కుమారి తన మేనకోడలుతో పాటు ఒక మహిళ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఒడిశా వెళ్లింది. కాగా ఆ మహిళ ప్రసవ సంబంధిత సమస్యలతో కన్నుమూసింది. దీంతో గర్భిణిగా ఉన్న కుమారి కంజాకమ్ లో అనేక భయాలు నెలకొన్నాయి. సెప్టెంబరు 20న చెన్నైకి చేరుకున్న ఆమె ఇంటిలోని బాత్రూమ్‌లో పడిపోయింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. ఈ నేపధ్యంలో ఆమెను కిల్పాక్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆమెకు కడుపు లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో వైద్యులు గర్భాశయం తొలగించాలని సూచించారు. ఈ నేపధ్యంలో సర్జరీ చేశారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ తరువాత మృతి చెందింది. అయితే పోస్టుమార్టం అనంతరం వైద్యులు మృతురాలి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఆమె అబార్షన్ కోసం మందులు మింగిందని తెలిపారు. కాగా పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక వైద్యుడు మాట్లాడుతూ ఆ మహిళ బాత్రూమ్‌లో పడపోకముందే ఆమె గర్భాశయం బలహీనంగా ఉందని, దీనికి తోడు ఆమె తీసుకున్న మందులు ఆమె ఆరోగ్యాన్ని దిగజార్చాయని తెలిపారు. 


Updated Date - 2021-09-29T14:29:16+05:30 IST