speed limits: హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారా? అయితే ఇది తెలుసుకుని తీరాల్సిందే!

ABN , First Publish Date - 2022-08-27T22:38:06+05:30 IST

భాగ్యనగరంలోని రోడ్లపై రయ్‌మంటూ దూసుకుపోతున్నారా? అయితే, ఇది కచ్చితంగా మీకోసమే. హైదరాబాద్‌లోని

speed limits: హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారా? అయితే ఇది తెలుసుకుని తీరాల్సిందే!

హైదరాబాద్: భాగ్యనగరంలోని రోడ్లపై రయ్‌మంటూ దూసుకుపోతున్నారా? అయితే, ఇది కచ్చితంగా మీకోసమే. హైదరాబాద్‌లోని ఒక్కో రోడ్డుపై ఒక్కో వేగ పరిమితి ఉంది. అయితే, ఏ రోడ్డుపై ఎంత వేగాన్ని అనుమతిస్తారన్న విషయం ఎవరికీ తెలియదు. ఒకే రోజు నగరం మొత్తాన్ని చుట్టేసేవారు ఉంటారు? కాబట్టి ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే, ఇకపై ఆ బాధ తప్పినట్టే. ఇలాంటి వారందరికీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ తెలిపేలా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 


జీహెచ్ఎంపీ పరిధిలోని వివిధ రోడ్లపై వివిధ వాహనాల గరిష్ఠ వేగ పరిమితి తెలపుతూ రాష్ట్రప్రభుత్వం మే నెలలో నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (CRMP) కింద జీహెచ్ఎంసీ దాని పరిధిలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల మరమ్మతులు, నిర్వహణ, రీ కార్పెటింగ్‌లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. ప్రస్తుతం వేగపరిమితి తెలిపేలా డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. 

 

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. డివైడర్లు ఉన్న రోడ్లపై కార్ల గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు. డివైడర్లు లేని రోడ్లపై 50 కిలోమీటర్లు  కాగా, కాలనీ రోడ్లపై కార్ల గరిష్ఠ వేగం 30 కి.మీ. ఇక, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల గరిష్ఠ వేగాన్ని డివైడర్లు ఉన్న రోడ్లపై 50 కి.మీ.గా, డివైడర్లు లేని రోడ్లపై 40 కిలోమీటర్లుగా నిర్దేశించారు. కాలనీ రోడ్లపై ఈ వాహనాలు 30 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణించకూడదు. అయితే, ఈ పరిమితి కేంద్ర ప్రభుత్వ వాహనాలకు వర్తించదు. అంతేకాదు, ఈ నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-27T22:38:06+05:30 IST