ఢిల్లీ వాతావ‘రణం’... రికార్డుల బీభత్సం!

ABN , First Publish Date - 2021-09-16T23:43:44+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్య వాతావరణాలు కొత్తేం కాదు. అలాగే, ఏ సీజన్ వచ్చినా హస్తినలో ‘అతి’ అత్యంత సహజం. కానీ, గత సంవత్సర కాలంలో మరీ అనూహ్యంగా సాగుతున్నాయి వాతావరణ పరిస్థితులు. ఎండ, వాన, చలి... అన్నీ ఆటాడించేస్తున్నాయి. మొత్తంగా, లాస్ట్ వన్ ఇయర్‌లో, ఢిల్లీలో... 21 క్లైమేట్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయట!

ఢిల్లీ వాతావ‘రణం’... రికార్డుల బీభత్సం!

దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్య వాతావరణాలు కొత్తేం కాదు. అలాగే, ఏ సీజన్ వచ్చినా హస్తినలో ‘అతి’ అత్యంత సహజం. కానీ, గత సంవత్సర కాలంలో మరీ అనూహ్యంగా సాగుతున్నాయి వాతావరణ పరిస్థితులు. ఎండ, వాన, చలి... అన్నీ ఆటాడించేస్తున్నాయి. మొత్తంగా, లాస్ట్ వన్ ఇయర్‌లో, ఢిల్లీలో... 21 క్లైమేట్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయట!

రాజధాని మహా నగరంలో మహా మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఓ సారి పరికిస్తే... గతీ నవంబర్ గడిచిన 71 ఏళ్లలో అత్యంత చల్లటి మాసంగా నమోదైంది. మరోవైపు, ఫిబ్రవరీ వద్దకొచ్చేసరికి, గత 120 ఏళ్ల కాలంలోనే, రెండో అత్యంత వెచ్చటి నెలగా కొనసాగింది. జూన్‌లోనూ ఢిల్లీ ఎవరూ ఊహించని విధంగా జనాల్ని వణికించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతకు ముందెప్పుడూ జూన్‌లో ఇంత తక్కువ టెంపరేచర్ రికార్డు కాలేదు. 

ఉక్కపోసే ఎండలు, వణికించే చలి మాత్రమే కాదు ఢిల్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో వర్షపాతంతో తడిసి ముద్దవుతోంది. గత 77 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ సెప్టెంబర్‌లో ఇప్పటికే వర్షాలు కురిశాయి. గత 121 ఏళ్ల వివరాలు ఆరా తీస్తే కూడా ఇప్పుడు కురుస్తోన్న ఢిల్లీ వర్షాలే... రెండో అత్యంత భారీ వానలట! 

యావత్ దేశానికి కీలకమైన రాజధాని నగరం ఇలా ప్రతీ సీజన్‌లోనూ అల్లాడిపోవటం తప్పకుండా ఆందోళన చెందాల్సిన పరిణామమే... 

Updated Date - 2021-09-16T23:43:44+05:30 IST