Naagin Dance: ‘మీకు ఈ నాగిని డ్యాన్స్ ఫాంటసీ ఏంటయ్యా’.. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల ‘నాగిని’ డ్యాన్స్ కథేంటంటే..

ABN , First Publish Date - 2022-09-03T23:25:37+05:30 IST

క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. ఆటగాళ్లకు, అభిమానులకు అదొక ఎమోషన్. మ్యాచ్‌లో ఓడితే కోపతాపాలు, కన్నీళ్లు. మ్యాచ్‌లో గెలిస్తే సంబరాలు, ప్రత్యర్థి జట్టు చర్యలకు..

Naagin Dance: ‘మీకు ఈ నాగిని డ్యాన్స్ ఫాంటసీ ఏంటయ్యా’.. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల ‘నాగిని’ డ్యాన్స్ కథేంటంటే..

క్రికెట్ (Cricket) అంటే కేవలం ఒక క్రీడ (Sport) మాత్రమే కాదు. ఆటగాళ్లకు, అభిమానులకు అదొక ఎమోషన్. మ్యాచ్‌లో (Cricket Match) ఓడితే కోపతాపాలు, కన్నీళ్లు. మ్యాచ్‌లో గెలిస్తే సంబరాలు, ప్రత్యర్థి జట్టు చర్యలకు ప్రతిచర్యలు. ఇందుకు ఆటగాళ్లేమీ మినహాయింపు కాదు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ (Asia Cup) మరోసారి ఇలాంటి ఎమోషనల్ మూమెంట్‌కు సాక్ష్యంగా నిలిచింది. విషయం ఏంటంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 1న బంగ్లాదేశ్ (Bangladesh), శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకూ నరాల తెగే ఉత్కంఠ నడుమ జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. బంగ్లాదేశ్ ఓడింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లంక విజయం సాధించగానే ఆ జట్టుకు చెందిన యువ ఆటగాడు చమిక కరుణరత్నే (Chamika Karunaratne) నాగిని డ్యాన్స్ (Nagin Dance) చేశాడు. అందుకు కారణం లేకపోలేదు. శ్రీలంక ఓటమి ఖాయమని, బంగ్లాదేశ్ గెలుపు పక్కా అని భావించిన కొందరు బంగ్లాదేశ్ అభిమానులు నాగిని డ్యాన్స్ చేసి కవ్వింపు చర్యలకు దిగారు. కానీ.. బొమ్మ తిరగబడింది. అనూహ్యంగా శ్రీలంక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. అవకాశం కోసం ఎదురుచూసిన చమిక కరుణరత్నే (Chamika Karunaratne Nagin Dance) అదే నాగిని డ్యాన్స్ చేసి బంగ్లా అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు. ఆ నాగిని డ్యాన్స్ చేసి శ్రీలంక గెలుపును (Srilanka Won) సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Nagin Dance Viral Video) అయింది. సింపుల్‌గా ఇదీ జరిగింది.



అయితే.. ‘శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల ఆటగాళ్లకు, అభిమానులకు ఈ నాగిని డ్యాన్స్ ఫ్యాంటసీ ఏంటయ్యా’ అని చాలా మంది నెటిజన్లు గూగుల్‌లో వెతుకులాట సాగిస్తున్నారు. నాగిని డ్యాన్స్‌ను రివేంజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ రెండు జట్ల అభిమానులు, ఆటగాళ్లు భావించడం వెనుక ఒక ఆసక్తికర విషయమే దాగుంది. అదేంటంటే.. 2016లో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్ నజ్ముల్ ఇస్లాం వికెట్ తీయగానే ఈ స్నేక్ డ్యాన్స్ అదేనండీ నాగిని డ్యాన్స్ చేశాడు. 2018 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన టీ20తో డెబ్యూ మ్యాచ్ ఆడిన నజ్ముల్ ఇస్లాం లంక ఆటగాళ్లలో ధనుష్క గుణతిలకతో పాటు కొందరి వికెట్లు తీశాడు. వికెట్ తీసిన ప్రతిసారి స్నేక్‌ డ్యాన్స్ చేశాడు. అతనితో పాటు తన టీంలోని ఇతర ఆటగాళ్లు కూడా కలిసి నాగిని డ్యాన్స్ చేశారు.



ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఈ సందర్భంలో గుణతిలక బంగ్లాదేశ్‌కు నాగిని డ్యాన్స్‌తోనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. మార్చి 2018లో నిధాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20 ట్రై సిరీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు రహీమ్ 35 బంతుల్లో 72 కొట్టి నాటౌట్‌గా నిలిచి బంగ్లాను గెలిపించాడు. ఆ విజయోత్సహంలో రహీమ్ నాగిని డ్యాన్స్ చేశాడు. అదే టోర్నమెంట్‌లో జరిగిన ఆరో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లా జట్లు మళ్లీ తలపడ్డాయి. చివరి ఓవర్లో రెండు బంతులకు ఆరు పరుగులు చేస్తేనే గెలుపు సొంతమయ్యే పరిస్థితి బంగ్లాదేశ్‌కు వచ్చింది. అలాంటి సందర్భంలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా సిక్స్ కొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఆ థ్రిల్లింగ్ విక్టరీతో ఉబ్బితబ్బిబ్బైన బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుని వెళ్లి అంతా కలిసి నాగిని డ్యాన్స్ చేశారు. ఈ రెండు జట్ల మధ్య అలా మొదలైన ఈ నాగిని డ్యాన్స్ పరంపర ఇప్పటికీ ఇలా కొనసాగుతోంది.

Updated Date - 2022-09-03T23:25:37+05:30 IST