హెరిటేజ్‌ ఫుడ్స్‌ 50% డివిడెండ్‌

ABN , First Publish Date - 2022-05-28T06:52:58+05:30 IST

హెరిటేజ్‌ ఫుడ్స్‌.. గత ఆర్థిక సంవత్సరాని(2021-22)కి గాను వాటాదారులకు 50 శాతం డివిడెండ్‌ ప్రకటించింది.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ 50% డివిడెండ్‌

2021-22 లాభం రూ.96 కోట్లు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌.. గత ఆర్థిక సంవత్సరాని(2021-22)కి గాను వాటాదారులకు 50 శాతం డివిడెండ్‌ ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.2.5 డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. కాగా మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 48 శాతం తగ్గి రూ.24.2 కోట్ల నుంచి రూ.12.6 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం 12.4 శాతం వృద్ధితో రూ.696 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 8.4 శాతం పెరుగుదలతో రూ.2,681 కోట్లకు చేరగా.. నికర లాభం రూ.96.5 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాదిలో లాభం రూ.149 కోట్లు ఉంది. కొవిడ్‌తో 2021-22 ఏడాదిలో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ఆదాయంలో వృద్ధిని నమోదు చేశామని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు. 

Updated Date - 2022-05-28T06:52:58+05:30 IST