సెట్స్‌పైకి విరుమాన్‌

Sep 17 2021 @ 23:26PM

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తిచేశారు కార్తి. తాజాగా తన కొత్త చిత్రం ‘విరుమాన్‌’ను సెట్స్‌ పైకి తెచ్చారు. మధురై సమీపంలోని థేని పట్టణంలో ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. గతంలో కార్తితో ‘కొంబన్‌’ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడు శంకర్‌ కూతురు అదితీ శంకర్‌ కథానాయికగా పరిచయమవుతున్నారు.  ప్రకా్‌షరాజ్‌, సూరి, ఆర్‌.కె సురేష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2డి ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.