నటుడు మోహన్‌బాబుకు స్వాగతం

ABN , First Publish Date - 2021-11-28T05:56:13+05:30 IST

ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు రాకతో గన్నవరం ఎయిర్‌పోర్టులో సందడి నెలకొంది.

నటుడు మోహన్‌బాబుకు స్వాగతం

గన్నవరం, నవంబరు 27 : ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు రాకతో గన్నవరం ఎయిర్‌పోర్టులో సందడి నెలకొంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. అభిమానులు బొకే, దుశ్శాలువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరానికి రావడం సంతోషంగా ఉందని, ఆత్మీయులను కలిసేందుకు వచ్చానన్నారు. అనంతరం రోడ్డు మార్గాన పెదపారుపూడి మండలం వా నపాముల వెళుతూ మార్గమధ్యంలో జామకాయలు కనిపించడంతో కారు ఆపి స్వ యంగా జామకాయలు కొనుగోలు చేశారు. కృష్ణాజిల్లా అంటే ఇష్టమని ఇక్కడి పం డ్లు రుచిగా ఉంటాయని చెప్పారు. పలువురు వాహనదారులు ఆయనతో సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. మధ్యాహ్నం ఆయ న తిరిగి ఎయిర్‌పోర్టుకు వచ్చి మరో ఇండిగో విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. 

Updated Date - 2021-11-28T05:56:13+05:30 IST