
తిరుమల: సినీ హీరో నాని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి మార్గంలో గురువారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆలయం ముందు నానిని చూడానికి అభిమానులు ఉత్సాహం చూపారు.
ఇవి కూడా చదవండి