టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ ఏ సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. సినీ వర్గాల్లో మాత్రం చాలా వార్తలే వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తోనూ రామ్ సినిమా చేస్తాడంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రామ్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని, అయితే ఆ సినిమా ఎప్పటి నుండో చెప్పలేమని అన్నాడు. లేటెస్ట్గా రామ్ తదుపరి సినిమాపై మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమాచారం మేరకు తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువనుందని టాక్ వినిపిస్తోంది.