విక్ట‌రీ వెంక‌టేష్ ఆవిష్క‌రించిన `ఇదే మా కథ` కాన్సెప్ట్ టీజ‌ర్‌

Sep 19 2021 @ 18:51PM

రెండేళ్ళక్రితం ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాతో చివరగా తెరమీద కనిపించిన యంగ్ హీరో సుమంత్ అశ్విన్ .. తదుపరిగా ఓ డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు. సినిమా పేరు ‘ఇదే మా కథ’. ఇది  టాలీవుడ్ లోనే మొట్టమొదటి రోడ్ జెర్నీ అడ్వంచరస్ మూవీ అవడం విశేషం. సుమంత్ అశ్విన్,  తాన్యా హోప్ జంటగా నటిస్తుండగా..   శ్రీకాంత్, భూమికా చావ్లా  ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు గురు పవన్.  ఇక ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే మా క‌థ టీజ‌ర్ చాలా బాగుంద‌ని ఇలాంటి కొత్త త‌ర‌హా చిత్రాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. బైక్‌ల‌పై సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న వివిధ వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ చిత్ర కథ. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది, ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఈ మూవీని ఏపీ,  తెలంగాణా రాష్ట్రాల్లో విడుద‌ల‌చేయ‌నుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా,  సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.