పలు తెలుగు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరో యాదా కృష్ణ (61) గుండెపోటుతో మరణించారు. బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన తుదిశ్వాస విడిచారు. `గుప్త శాస్త్రం`, `వయసు కోరిక`, `పిక్నిక్` వంటి పలు సినిమాల్లో ఆయన నటించారు. 2010లో వచ్చిన `సంక్రాంతి అల్లుడు` ఆయన చివరి సినిమా. 20కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.