
కోలీవుడ్: ‘కేడి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్గా తమన్నా పరిచయమైంది. అయితే, ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం ‘పడిక్కాదవన్’. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్ సాధించింది. దీంతో తమన్నాకు కూడా మంచి గుర్తింపువచ్చింది. ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరో సూర్య నటించిన ‘అయన్’ చిత్రం తమన్నా క్రేజ్ పెంచడమేకాదు... మంచి మార్కెట్ కూడా సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ నటించిన ‘సురా’ చిత్రంలో నటించింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగిచూడని తమన్నా.. ఇటు తమిళం, అటు తెలుగు భాషల్లో నటిస్తూ అగ్రహీరోయిన్ల జాబితాలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ మిల్కీబ్యూటీకి కరోనా వైరస్ సోకింది. దీంతో వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లోకి వెళ్ళిపోయింది. హోంక్వారంటైన్లో కాస్త లావు పెరగడంతో మిల్క్‌బ్యూటీ జిమ్‌లోకి ఎంటరైంది. తమన్నా వ్యాయామం చేస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.