నివర్‌ బీభత్సం

ABN , First Publish Date - 2020-11-27T06:06:23+05:30 IST

నాగులుప్పల పాడు మండ లంలో బుధవా రం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తున్నది. తీరం వెంబడి వీస్తున్న ఈదురుగాలులతో ప్రజలు ఇళ్లకు పరిమితమ య్యారు.

నివర్‌ బీభత్సం
చేజర్ల పొలాల్లో కూలిన కరెంటు స్తంభం

ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు

కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు

పలుచోట్ల రాకపోకలకు అంతరాయం 

పొంగిన వాగులు, వంకలు రోడ్లు జలమయం 

నీటమునిగిన పంటలు  

ఇబ్బందిపడిన ప్రజలు



నాగులుప్పలపాడు, నవం బరు 26 : నాగులుప్పల పాడు మండ లంలో బుధవా రం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తున్నది. తీరం వెంబడి వీస్తున్న ఈదురుగాలులతో ప్రజలు ఇళ్లకు పరిమితమ య్యారు. ఈ సందర్భంగా మండల తుపాను ప్రత్యేకాధికారి, డిప్యూటీ సీఈవో సాయికుమారి, తహసీల్దార్‌ బాబ్జి, ఎంపీడీవో రాజేష్‌బాబు, సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ శశికుమార్‌ల బృందం ప్రజల ను అప్రమత్తం చేశారు. కనపర్తి వెళ్లే రహదా రిలో గాలులకు చెట్లు కూలడంతో పోలీసులు ఎ క్స్‌వేటర్‌ను తెప్పించి తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నాగులుప్పలపా డు నుంచి తిమ్మనపాలెం వెళ్లే రోడ్డులోని హను మానపురం, కొత్తకోట వాగులు పొంగిపొర్లడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి చద లవాడ సమీపంలో గత వర్షాలకు చెరువు కట్ట తెగిన ప్రాంతంలో రెండు అడులు మేర వర్షపు నీరు పారి ఒంగోలు-చీరాల రహదారిలో ఇబ్బం దులు ఏర్పడ్డాయి. వర్షంతో పంటలకు తీరని న ష్టం వాటిల్లిందని రైతులు వాపో తున్నారు. 


 గుండ్లకమ్మకు వరద ఉధృతి


మద్దిపాడు : నివర్‌ తుపాను ప్రభావంతో గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కులు వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై మూడుగేట్లు ఎత్తి నీటిని సముద్రం లోకి వదిలారు.  మండలంలో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 


నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు 


ఒంగోలు(రూరల్‌) :  తుపాను ప్రభావంతో ఒంగోలు మండలంలోని తీర ప్రాంతాల్లో గురువా రం విద్యుత్‌ లేక అంధకారం నెలకొంది. చేజర్ల వద్ద గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఒంగోలు-కొప్పొలురోడ్డులో భారీగా వర్షపునీరు చే రడంతో వాహనదారులు రాకపోకలు సాగించేం దుకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. కాగా ఒంగోలు నగర శివారుకాలను జలమయం కావడంతో ని రాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వారికి ఆహార సదుపాయాలు క ల్పించినట్లు డీఈవో సుబ్బారావు, తహసీల్దార్‌ చి రంజీవి, ఎంపీడీవో జాలిరెడ్డి తెలిపారు. పలు గ్రామాల్లో పర్యటించి అప్రమత్తం చేశారు. 


చీమకుర్తి మండలంలో..


చీమకుర్తి :  నివర్‌ తుపాను ప్రభావంతో మ ండలంలో జనజీవనం స్తంభించిపోయింది. దేవర పాలెం, పి.నాయుడుపాలెం ప్రాంతాల్లో సాగు చేసిన దాదాపు 100 హెక్టార్‌ల్లో కోతకు వచ్చిన వరి పంట వాలిపోయింది. దాదాపు 1300 హె క్టార్లలో కంది పంట పూత దశకు రాగా తీవ్రన ష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతు న్నారు. మంచికలపాడు, బండ్లమూడి మధ్య ఉ న్న ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించి పోయాయి. నాయుడుపా లెం రహదారిపై వాగు నీరు పొంగింది. వీవా క్వారీ సమీపంలో కర్నూల్‌రోడ్డుపై నిలిచిపోయిన నీటితో వాహనదారులు అల్లాడుతున్నారు. చీమ కుర్తిలో లోతట్టు కాలనీలు జలమయ్యాయి. తహ సీల్దార్‌ మధుసూదనరావు. ఎస్‌ఐ నాగశివారెడ్డి పలు ప్రాంతాలను సందర్శించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం 9347193815, 9542500501 సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలని వారు కోరారు.




Updated Date - 2020-11-27T06:06:23+05:30 IST