హే మేఘనా

ABN , First Publish Date - 2021-07-28T05:59:31+05:30 IST

ఒరేయ్‌ షణ్ముఖ్‌... ఎదురింటికెళ్లి తోడుకి పెరుగు తీసుకురా’... తన కొడుకుకి తల్లి ఆర్డర్‌. ‘బుక్‌ తీయకోతే తీయలేదంటారు.

హే మేఘనా

రేయ్‌ షణ్ముఖ్‌... ఎదురింటికెళ్లి తోడుకి పెరుగు తీసుకురా’... తన కొడుకుకి తల్లి ఆర్డర్‌. ‘బుక్‌ తీయకోతే తీయలేదంటారు. తీస్తే పెరుగు, పాలు అంటూ పనికిమాలిన పనులు చెప్పి చదివే మూడంతా స్పాయిల్‌ చేస్తారు’... షణ్ముఖ్‌ చికాకు. ‘ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో మార్కులెన్నిరా?’... అమ్మ ప్రశ్న. ‘ఏ ఇల్లు? ఎదురిల్లేగా’... మరో మాట మాట్లాడకుండా జారుకొంటాడు షణ్ముఖ్‌. ఎదురింటికి వెళతాడు. అక్కడ మేఘన పాటకు డ్యాన్స్‌ చేస్తూ మైమరచిపోతుంటుంది. సడెన్‌గా తలుపు తోసుకుని ఇంట్లోకి వచ్చిన షణ్ముఖ్‌ని చూసి డ్యాన్స్‌ ఆపేస్తుంది. ‘ఎదురింట్లో ఉంటాను. పెరుగు కోసం వచ్చాను’ అంటాడు అతడు. ‘ఇక్కడే ఉండు. తెస్తాను’ అంటూ తను లోపలికి పోతుంది. మేఘనను చూడగానే మనోడు పడిపోతాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు పరిచయం చేసుకొంటారు. ‘నేను ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌’... షణ్ముఖ్‌ చెబుతాడు. ‘నేను బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌. అంటే నువ్వు నాకన్నా చిన్న అనమాట. సరే ఉంటా తమ్ముడు’ అంటుంది మేఘన. ‘హేయ్‌... మీరలా తమ్ముడు అని పిలవకండి. మనసుకు అదోలా ఉంది. ఎనీవే డ్యాన్స్‌ బాగా చేశారు’ అంటాడు అతడు. ఎలాగైనా తనతో పరిచయం పెంచుకోవాలనుకొంటాడు. 


ఇంటికి వెళ్లి అమ్మని అడుగుతాడు... ‘ఆ అమ్మాయి బాగా చదువుతుందంటున్నావ్‌. పైగా సీనియర్‌. కాస్త వాళ్లమ్మకు చెప్పచ్చు కదా... నేను తనతో పాఠాలు చెప్పించుకొంటా’ అని. సరేనంటుంది తల్లి. మేఘన ఇంట్లో పాఠాలు మొదలవుతాయి. మేఘన చెబుతూనే ఉంటుంది. కానీ... షణ్ముఖ్‌ చెవికి ఏమీ ఎక్కవు. ఆమెనూ చూస్తుంటాడు. క్రమంగా తనకు దగ్గరవుతాడు. మేఘన కూడా మనోడిపై మనసు పారేసుకుంటుంది. ఒకరోజు షణ్ముఖ్‌ మేఘన ఇంటికి వెళతాడు. ఆ సమయంలో ఆమె పడుకుని ఉంటుంది. అది చూసి అతడు రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లిపోతాడు. పక్కన కూర్చొని... వద్దనుకొంటూనే నడుంపై చెయ్యి వేస్తాడు. షాక్‌ తగిలినట్టు లేస్తుంది మేఘన. చెంప ఛల్‌ మనిపిస్తుంది. సారీ అంటాడు షణ్ముఖ్‌. ‘సారీ చెబితే తప్పు ఒప్పయిపోతుందా? మనిషి దగ్గరైతే శరీరం కూడా దగ్గరవ్వాలనే చీప్‌ మెంటాలిటీ ఏంటిరా! ఒక్క క్షణం కూడా ఇక్కడుండకు. వెళ్లిపో’ అంటూ తిట్టి పంపిస్తుంది. చేసిన తప్పును తలుచుకుని బాధపడుతుంటాడు షణ్ముఖ్‌. ఆమె తలపుల్లోనే మునిగిపోతాడు. తరువాత ఏమైంది? మేఘన అతడిని క్షమిస్తుందా? షణ్ముఖ్‌ ప్రేమ గెలుస్తుందా? ‘హే మేఘన’ లఘుచిత్రంలో చూడండి. విక్రమ్‌, సుష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అనిల్‌కుమార్‌. చివర్లో చిన్న ట్విస్ట్‌ కథకు హైలైట్‌. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ని లక్షన్నర మందికి పైగా వీక్షించారు. 

Updated Date - 2021-07-28T05:59:31+05:30 IST