Advertisement

బీసీ గణన పద్ధతి సరికాదు

Apr 23 2021 @ 04:22AM

అది రాజ్యాంగ విరుద్ధం: హైకోర్టు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): బీసీ జనాభా గణనకు ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. 2019లో పంచాయతీ ఎన్నికలను బీసీ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్వహించారా? లేక 2011 జనాభా లెక్కల ప్రకారం జరిపారా అన్నది చెప్పాలని ధర్మాసనం అదనపు ఏజీ జె. రామచంద్రరావును ప్రశ్నించింది. బీసీ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా... మీకు మీరే సొంత నిర్ణయం తీసుకుంటే ఎలా అని ధర్మాసనం నిలదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్వహించిన పంచాయతీల ఎన్నికలు రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. ఇదే వైఖరి కొనసాగితే కోర్టుధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు.


కానీ ఇంత వరకు బీసీ కమిషన్‌ను ఎందుకు వేయలేద’ని నిలదీసింది. బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బీసీల గణన బాధ్యత అప్పగిస్తూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణను రద్దుచేస్తున్నట్లు స్పష్టం చేసింది. త్వరగా బీసీ కమిషన్‌ను నియమించాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. బీసీ కమిషన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 34శాతం నుంచి 22శాతానికి తెలంగాణ ప్రభు త్వం తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 

Follow Us on:
Advertisement

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.