
అమరావతి: విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏర్పాటు చేసిన హోర్డింగ్ తొలగించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. కాగా హోర్డింగ్‌ను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. అయితే హోర్డింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బొమ్మ ఉందని కార్పొరేషన్ వారు తొలగించారని న్యాయవాది శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఆ హోర్డింగ్‌ను మళ్లీ ఏర్పాటు చేస్తే అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టు వరకు హోర్డింగ్‌ను తొలగించవద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి