Advertisement

గద్వాల కలెక్టర్‌పై హైకోర్టు అసంతృప్తి

Apr 22 2021 @ 23:20PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఓ కేసులో కౌంటర్‌ వేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, నీటి పారుదల శాఖ ఈఈ తీ రుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్‌ వేసేం దుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి అవకాశం ఇచ్చినా, కౌంటర్‌ దాఖలు చే యకపోగా మరోసారి గడువు కోరడాన్ని తప్పు పట్టింది. అధికారులు ఒ క్కొక్కరు పిటిషనర్‌కు రూ.5 వేలు చొప్పున చెల్లించిన తర్వాతే కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరుపు న్యాయవాది కల్పించుకుంటూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపిస్తున్న మహామ్మారి వల్ల కౌంటర్లు దాఖలు చేయడంలో కొంత జాప్యం జరిగిందని, కోర్టు విధించిన ఖర్చులు మినహాయించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదు పరి విచారణకు ముగ్గురు అధికారులు హాజరు కావాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయకపోతే రెట్టింపు మొత్తం పిటిషనర్‌కు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బుద్దారెడ్డిపల్లిలోని పల్లె చెరు వు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో గ్రామ పంచాయతీ భవనా న్ని నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ, అదే గ్రామానికి చెందిన ఎన్‌.క్రిష్ణయ్య అనే రైతు హైకోర్టును ఆశ్ర యించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం నిరుడు సెప్టెంబర్‌లో నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవ రిలో మరోసారి కౌంటర్‌ దా ఖలు చేసేందుకు చివ రి అవకాశం ఇచ్చింది. అయినా అధికారులు కౌం టర్‌ దాఖలు చేయకపోవ డంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌం టర్‌ వేయ కపోతే ఇకపై కౌంటర్‌ దాఖలు చేసే హక్కు కోల్పోతారని స్పష్టం చేసింది.

Follow Us on:
Advertisement