‘హైకోర్టు అంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్క లేదా?’

ABN , First Publish Date - 2021-05-11T18:41:22+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.

‘హైకోర్టు అంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్క లేదా?’

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. గత విచారణలో ఎక్స్‌‌పర్ట్ కమిటీ వేయమని చెప్పాం వేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఆపమని ఎవరు చెప్పారు? ఈ సమయంలో అంబులెన్స్‌లు ఆపడం మానవత్వమా? అంబులెన్స్ రేట్లను నియంత్రించాలని చెప్పాం.. చేశారా? రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్‌లు చేయాలని చెప్పాం చేశారా? పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మత పరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు? రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా? ఈ లోపే వైరస్ విజృంభిస్తుంది కదా? మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ మీట్ లు పెట్టి పరిస్థితి అంతా బాగుంది లాక్‌డౌన్ అవసరం లేదని ఎలా చెప్తారు? యాక్టివ్ కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? మేం టెస్ట్‌ల సంఖ్య పెంచాలని చెబితే అందుకు భిన్నంగా తగ్గించారు - హై కోర్టు అంటే మీ ప్రభుత్వానికి లెక్క లేదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. 


Updated Date - 2021-05-11T18:41:22+05:30 IST