మళ్లీ కదలిక

ABN , First Publish Date - 2021-01-22T05:20:27+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ వేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికలు ఆపడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం సరికాదని పేర్కొంది. ఇబ్బందులను అధిగమిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వానికీ సూచించింది. ఈ పరిణామంతో స్థానిక పోరుకు మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల్లో మళ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

మళ్లీ కదలిక

 పంచాయతీ పోరుకు హైకోర్టు పచ్చజెండా

 గత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికల నిర్వహణ

 నాలుగు దశల్లో పోలింగ్‌

 పల్లెల్లో కోడ్‌ అమలులోకి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ వేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికలు ఆపడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం సరికాదని పేర్కొంది. ఇబ్బందులను అధిగమిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వానికీ సూచించింది. ఈ పరిణామంతో స్థానిక పోరుకు మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల్లో మళ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

-----------------------

పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా గత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఆశావహుల్లో సందడి కనిపిస్తోంది. ఆది నుంచీ ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సాకుతో ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజా పరిణామాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో పల్లెల్లో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. త్వరలోనే ఎన్నికల నిర్వహణపై సమీక్షించేందుకు డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశానికి ఈసీ సిద్ధమవుతోంది. గత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 1,190 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ నెల 27,  31, ఫిబ్రవరి 4, 8 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు.. తిరిగి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఉప సర్పంచుల ఎన్నిక  ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నిర్వహిస్తారు.   

 రాజకీయ వర్గాల్లో చర్చ....

హైకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల చర్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరికి వారే తమకు ఎన్నికలంటే భయం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా, తాము సిద్ధమని ఇప్పటికే టీడీపీ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రకటించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలంటే టీడీపీకే భయమని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ, జనసేన నాయకులు పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్పంగా ఓటు బ్యాంకు సంపాదించుకున్నప్పటికీ పంచాయతీ పోరులో అన్నిచోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మళ్లీ పల్లెల్లో ఎన్నికల వేడి మొదలవుతోంది. 

Updated Date - 2021-01-22T05:20:27+05:30 IST