సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-03-09T19:33:30+05:30 IST

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల తరపున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల తరపున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారన్నారు. ప్రొసీడింగ్ కాపీ ఎక్కడ అని హైకోర్టు ప్రశ్నించింది. న్యూస్ పేపర్, మీడియా ఛానెల్స్, యూట్యూబ్ ఆధారంగా పిటిషన్ వేశామని పిటిషనర్ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. స్పీకర్ ఎవరిని సస్పెండ్ చేశారో చెప్పాలని.. కానీ అలా జరగలేదన్నారు. ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదని దేశాయ్ ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలని.. కానీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అది జరగలేదని దేశాయ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాగా.. శాసన సభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కాపీ పైన వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-03-09T19:33:30+05:30 IST