తెలంగాణ జైళ్ల శాఖలో పదోన్నతులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-03-02T22:24:05+05:30 IST

తెలంగాణ జైళ్ల శాఖలో మహిళా సూపరింటెండెంట్స్‌కు పదోన్నతి కల్పించాలన్న పిటిషన్‌పై

తెలంగాణ జైళ్ల శాఖలో పదోన్నతులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో మహిళా సూపరింటెండెంట్స్‌కు పదోన్నతి కల్పించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంచల్‌గూడ మహిళా జైల్‌ సూపరింటెండెంట్‌ వెంకటలక్ష్మి పిటిషన్‌ వేసింది. 13% శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని వెంకటలక్ష్మి కోరింది. రెండు నెలల్లో జైళ్లశాఖలో సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు అదేశాలు ఇచ్చింది. రెండు నెలలైనా హైకోర్టు ఆదేశాలను అమలు చెయ్యడం లేదని కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. కోర్ట్ ధిక్కరణ పిటీషన్ నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి 14 తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, జైల్ శాఖ డిజి,జైల్ శాఖ ఐజీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేరుగా హాజరు కావాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను మార్చి 14 కు హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-02T22:24:05+05:30 IST