గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించే అంశంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-07-19T23:56:22+05:30 IST

అమరావతి: గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వారిని మహిళా పోలీసులుగా గుర్తించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్లు నర్రా శ్రీనివాస్, బాలాజీ వాదించారు. కాగా గ్రామకార్యదర్శులను

గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించే అంశంపై హైకోర్టులో విచారణ

అమరావతి: గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించే అంశంపై ఏపీ హైకోర్టు (AP High court)లో విచారణ జరిగింది. వారిని మహిళా పోలీసులుగా గుర్తించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్లు నర్రా శ్రీనివాస్, బాలాజీ వాదించారు. కాగా గ్రామకార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించేందుకు చట్టం చేస్తున్నామని ఏజీ సమాధానమిచ్చారు. గ్రామ మహిళా కార్యదర్శులు యూనిఫామ్ వేసుకుంటే మీకు ఇబ్బందేంటని పిటిషనర్ తరపు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. పోలీస్ ఉద్యోగానికి మహిళా  కార్యదర్శులు అనర్హులని, ప్రభుత్వం చేస్తున్న చట్టంలో ఆప్షన్ ఇవ్వాలని పిటిషనర్ తరుపు లాయర్లు జడ్జి దృష్టికి తెచ్చారు. అందుకు ఏజీ అంగీకరించడంతో కేసు విచారణ ఆగస్ట్ 19కి వాయిదా పడింది.

Updated Date - 2022-07-19T23:56:22+05:30 IST