టీఆర్ఎస్ నేతల ఆందోళనలపై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2022-04-07T02:46:02+05:30 IST

టీఆర్ఎస్ నేతల ఆందోళనలపై తెలంగాణ హైకోర్టులో

టీఆర్ఎస్ నేతల ఆందోళనలపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: టీఆర్ఎస్ నేతల ఆందోళనలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాకతీయ లారీ అసోసియేషన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టీఆర్ఎస్ జాతీయ రహదారుల మీద రాస్తారోకో నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందుల దృష్ట్యా పిటిషన్ దాఖలు చేసింది. టీఆర్ఎస్  నేతలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని కోర్టుకు  ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటన జరగలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అనుమతుల లేకుండా నిరసన ప్రదర్శనలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. భవిష్యత్తులో అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హైకోర్టు పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలని హైకోర్టు సూచించింది. రెండు వారాల్లో ఎన్ని కేసులు నమోదు చేశారనే దానిపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2022-04-07T02:46:02+05:30 IST