హైకోర్టు పరిధి దాటి పనిచేస్తోంది: జగన్‌

Published: Thu, 24 Mar 2022 17:23:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైకోర్టు పరిధి దాటి పనిచేస్తోంది: జగన్‌

అమరావతి: అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలని, లేకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ అసలు చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం.. వెనక్కి తీసుకున్న చట్టంపై తీర్పు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. రాజధానిపై ఎవరికి వాళ్లు ఊహించుకుంటున్నారని, శాసనవ్యవస్థ చట్టాన్ని చేయాలో వద్దో కోర్టులు నిర్ణయించలేవన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారని, అందుకే తమకు అధికారం ఇచ్చారని జగన్ తెలిపారు.


‘‘అభివృద్ధి లేకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వికేంద్రీకరణతోనే ఏపీలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. మూడు రాజధానులపై కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైకోర్టు తీర్పు రాష్ట్ర అధికారాలను ప్రశ్నించేలా ఉంది. రాష్ట్ర హైకోర్టు పరిధి దాటి పనిచేస్తోంది. శాసనసభకు అధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది’’ అని జగన్‌ తెలిపారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.