‘గోపలాయపల్లి’ని సందర్శించిన హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2022-10-08T05:53:01+05:30 IST

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి గుట్టపై హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న గోపలాయపల్లి వారిజాల వే ణుగోపాలస్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి సంతో్‌షరెడ్డి దంపతులు శుక్రవారం సందర్శించారు.

‘గోపలాయపల్లి’ని సందర్శించిన హైకోర్టు జడ్జి
ప్రధానాలయం వద్ద పూజల్లో పాల్గొన్న జడ్జి దంపతులు

 నార్కట్‌పల్లి, అ క్టోబరు 7: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి గుట్టపై హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న గోపలాయపల్లి వారిజాల వే ణుగోపాలస్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి సంతో్‌షరెడ్డి దంపతులు శుక్రవారం సందర్శించారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్న న్యాయమూర్తికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ పరిసరాలను ఆసాంతం పరిశీలించిన అనంతరం క్షేత్ర విశిష్టతను హైకోర్టు జడ్జికి కోమటిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి కీర్తి, ఈవో అంబటి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-10-08T05:53:01+05:30 IST