
హైదరాబాద్: 10 మంది నూతన హైకోర్టు జడ్జిలు గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 12 మంది పేర్లలో 10 మంది పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో న్యాయవాదుల కోటా నుంచి ఐదుగురు, న్యాయాధికారుల (జ్యుడీషియల్ ఆఫీసర్స్) కోటా నుంచి ఐదుగురు ఉన్నారు. న్యాయమూర్తులుగా నియమితులైనవారిలో కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, నచ్చరాజు శ్రవణ్‌కుమార్, జి.అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున్ ఉన్నారు. నూతన హైకోర్టు జడ్జిలు రేపు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఇవి కూడా చదవండి