రెండు వారాల పాటు తొందరపాటు చర్యలొద్దు

ABN , First Publish Date - 2021-07-24T06:51:36+05:30 IST

తాడేపల్లి సీఎం జగన్మోన్‌రెడ్డి నివాసం వెనుక అమరారెడ్డి నగర్‌ కాలనీలో ఉంటూ ఇళ్లు కూల్చివేతను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు ప్రత్యామ్నాయ నివాసం చూసుకొనేందుకు హైకోర్టు ఆగస్టు 6 వరకు గడవు ఇచ్చింది.

రెండు వారాల పాటు తొందరపాటు చర్యలొద్దు

ఇళ్ల కూల్చివేతపై అధికారులకు హైకోర్టు ఆదేశం

ఆగస్టు 6లోగా ప్రత్యామ్నాయ నివాసాలు చూసుకోవాలని పిటిషనర్లకు సూచన

అమరావతి, జులై23 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లి సీఎం జగన్మోన్‌రెడ్డి నివాసం వెనుక  అమరారెడ్డి నగర్‌ కాలనీలో ఉంటూ ఇళ్లు కూల్చివేతను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు ప్రత్యామ్నాయ నివాసం చూసుకొనేందుకు హైకోర్టు ఆగస్టు 6 వరకు గడవు ఇచ్చింది. ఆ లోపు ఇళ్లు కూల్చివేతపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేశా రు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. రమేష్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఇళ్ల కూల్చివేతల ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ వలంటీర్‌ శివశ్రీ తల్లి వి.రాజ్యలక్ష్మి మరో నలుగురు గురువారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దా ఖలు చేశారు. ఇళ్లపట్టాలు కేటాయించేలా ఆదేశించాలంటూ మరికొందరు మరో పిటిషన్‌ దాఖలు చేశా రు. గురువారం ఈ వ్యాజ్యాలు విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్లకు ప్రత్యామ్నా య నివాసాల ఏర్పాటు సాఽధ్యసాధ్యాలను పరిశీలించాలని ఎస్‌జీపీకి సూచించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లకు ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు సాధ్యం కాదన్నారు. పిటిషనర్లకు నివాసం కల్పిస్తే తమకు కూడా ఇళ్లివ్వాలని మరింతమంది కోరుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయిందన్నారు. పిటిషనర్లకు నష్టపరిహారంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కూడా కేటాయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం తీసుకొని ఇప్పటికే 246 మంది ప్రత్యామ్నాయ నివాసాలు చూసుకున్నారన్నారు. ఇళ్లు కోల్పోతున్నవారిలో కేవలం 22మంది మాత్రమే కోర్టును ఆశ్రయించారన్నారు. వారు ఇళ్లు ఖాళీ చేసేందుకు వారం రోజులు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వి.శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ ప్రత్యామ్నాయ నివాసాలు చూ సుకొనేందుకు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కోరారు. వర్షాల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో ఇప్పటికిప్పుడు ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యం కా దన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ప్రభుత్వం నుం చి నష్టపరిహారం తీసుకున్న తరువాత ఇళ్లు ఖాళీ చేసేందుకు 3నెలల సమయం కోరడం సరికాదన్నా రు. 2 వారాల్లోగా ప్రత్యామ్నాయ నివాసాలు చూసుకొని ఇళ్లను ఖాళీ చేయాలని స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-24T06:51:36+05:30 IST