వారసత్వ భవనాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు?

ABN , First Publish Date - 2022-06-19T15:17:04+05:30 IST

వారసత్వ భవనంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ ఏసీ గార్డ్స్‌లోని ఖుస్రో మంజిల్‌ను ఎందుకు కూల్చేస్తున్నారో వివరణ ఇవ్వాలని

వారసత్వ భవనాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు?

ఖుస్రో మంజిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్‌: వారసత్వ భవనంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ ఏసీ గార్డ్స్‌లోని ఖుస్రో మంజిల్‌ను ఎందుకు కూల్చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఖుస్రో మంజిల్‌ను 1998లో జీవో 102 ద్వారా హెరిటేజ్‌ భవనంగా గుర్తించారని, దీనిని మున్సిపల్‌ అధికారులు కూల్చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ హిల్‌ వ్యూ కాలనీకి చెందిన బాల రామచంద్రం, తదితరులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ హెరిటేజ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌తోపాటు ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఖుస్రో మంజిల్‌ భవనం పూర్వస్థితిని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం.. దీనిపై నాలుగువారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-06-19T15:17:04+05:30 IST