సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-04-07T21:24:45+05:30 IST

సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌‌ను హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్

సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌‌ను హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా  కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని  కలెక్టర్‌‌ను హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని కలెక్టర్‌కు ఆదేశించింది. అలాగే విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణికి హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని సంధ్యారాణిని ఆదేశించింది. 



గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి రూ. 2వేల జరిమానాను  సింగిల్ జడ్జివిధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మాసనం ఎదుట వీరు అప్పీల్ చేశారు. అయితే వీరిద్దరూ సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ  హైకోర్టు విచారణను ముగించింది.

Updated Date - 2021-04-07T21:24:45+05:30 IST