హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

Jul 23 2021 @ 00:49AM

ఏర్గట్ల, జూలై 22: మండల కేంద్రంలోని తీగలవాగుపై హైలె వల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో వారు మాట్లాడారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తీగల వాగుపై నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని, వర్షాల కారణంగా రాకపోకలకు అంత రాయం ఏర్పడిందన్నా రు. పొలాలు నీటి మునిగి రైతులకు ఇ బ్బందులు తప్పడం లేదని అ న్నారు. లోలెవల్‌ వంతెనలతో గ్రామాలన్నీ నీటితో దిగ్బంధం అయిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. కార్య క్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్‌, మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి పాల్గొన్నారు.

Follow Us on: