గిరిజనుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-10T06:28:18+05:30 IST

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏయూలోని అంబేడ్కర్‌ హాలులో జరిగిన ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గిరిజనుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
దివాసీ ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం రాజన్న దొర

ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర

ఎంవీపీ కాలనీ, ఆగస్టు 9: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏయూలోని అంబేడ్కర్‌ హాలులో జరిగిన ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీ చట్టాలు సక్రమంగా అమలయ్యే విధంగా కృషిచేస్తామని, ఆదివాసీ హక్కుల పరిరక్షణకు తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. ఆదివాసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లి సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఏయూ పూర్వ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎం.ప్రసాదరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు కె.సత్యనారాయణ, ఆర్‌.సత్యారావు, దొండ సత్యనారాయణ, కటారి శోభన్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు. తొలుత ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. బీచ్‌ రోడ్డునుంచి ఏయూలోని అంబేడ్కర్‌ హాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. 


Updated Date - 2022-08-10T06:28:18+05:30 IST