పచ్చదనం,పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-06-18T07:01:41+05:30 IST

మునిసిపాలిటీల్లో పచ్చదనం–పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. చౌటుప్పల్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించే స్థలాలన్ని, మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చనున్న నాగులకుంటను, 65వ నంబరు జాతీయ రహదారి వెంట పెంచుతున్న మొక్కలతో పాటు నర్సరీలను మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌ రెడ్డి రాజుతో ఖీమ్యానాయక్‌ గురువారం పరిశీలించి మాట్లాడారు.

పచ్చదనం,పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం
చౌటుప్పల్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు

అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌

చౌటుప్పల్‌ టౌన్‌, జూన్‌ 17: మునిసిపాలిటీల్లో  పచ్చదనం–పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. చౌటుప్పల్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించే స్థలాలన్ని, మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చనున్న నాగులకుంటను,  65వ నంబరు జాతీయ రహదారి వెంట పెంచుతున్న మొక్కలతో పాటు నర్సరీలను మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌ రెడ్డి రాజుతో ఖీమ్యానాయక్‌ గురువారం పరిశీలించి మాట్లాడారు. పారిశుధ్య పనులను అధికారులతో పాటు కౌన్సిలర్లు పర్యవేక్షించాలన్నారు. రూ.కోటి  కేటాయించిన వైకుంఠధామం పనులతో పాటు డంపింగ్‌ యార్డును త్వరగా పూర్తి చేయించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణంతో వ్యాపారు లకు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు.  ఓయా సిస్‌ అసోసియేట్‌ డిజైనింగ్‌ టీమ్‌ ఆర్కిటెక్చర్‌ పోలోజు అనిల్‌కుమార్‌ రూపొందించిన నాగులకుంట సుందరీకరణ డిజైన్‌ను ఖీమ్యానాయక్‌, చైర్మన్‌  రాజు, కమిషనర్‌ కె.నర్సింహారెడ్డిలు పరిశాలించారు. ఈ డీపీఆర్‌ను రెండు, మూడు రోజుల్లో అందజేయాలని వారు సూచించారు. నాగులకుంటను మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చాలన్న తన కల త్వరలోనే సాకరంకానుందని  చైర్మన్‌ రాజు తెలిపారు.  మునిసిపాలిటీలోని వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్‌ జి.జగదీష్‌రెడ్డి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు  చైర్మన్‌ రాజు తెలిపారు. 


Updated Date - 2021-06-18T07:01:41+05:30 IST