డివైడర్‌ ఉన్న రోడ్డుపై.. గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు

ABN , First Publish Date - 2022-05-26T08:53:44+05:30 IST

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ అంటేనే వేల వాహనాలు.. వీటిని వేగంగా నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. రాత్రివేళ దూసుకెళ్లి

డివైడర్‌ ఉన్న రోడ్డుపై.. గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు

డివైడర్‌ లేని రహదారిపై 50 కి.మీ.

కాలనీ రోడ్లపై 30 కి.మీ. మించొద్దు

బస్సులు, బైక్‌లు, ఆటోలకు 50-40-30

జీహెచ్‌ఎంసీలో అమలుకు ఉత్తర్వులు

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ అంటేనే వేల వాహనాలు.. వీటిని వేగంగా నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. రాత్రివేళ దూసుకెళ్లి ప్రమాదాలు చేసే వారు కూడా తక్కువేం కాదు. ఇకపై ఈ వేగానికి అడ్డుకట్ట పడనుంది. మోటారు వాహన భద్రతా చర్యల్లో భాగంగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వేగాన్ని నియంత్రిస్తూ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం డివైడర్‌ ఉన్న రహదారిపై కార్ల గరిష్ఠ వేగం గంటకు 60 కిలోమీటర్లు మించకూడదు. డివైడర్లు లేని రోడ్లపై అయితే 50 కి.మీ., కాలనీ రోడ్లపై 30 కి.మీ. వేగం దాటకూడదు. వస్తు రవాణా లారీలు, బస్సులు, ఆటోలు, మోటారు సైకిళ్లు.. డివైడర్‌ ఉన్న రహదారిపై 50 కి.మీ., డివైడర్‌ లేని రోడ్డుపై 40 కి.మీ., కాలనీ రోడ్లలో 30 కి.మీ. వేగంలోపే వెళ్లాలని ఉత్తర్వుల్లో రవాణా శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-26T08:53:44+05:30 IST