నివురుగప్పిన నిప్పులా తాడిపత్రి

ABN , First Publish Date - 2022-10-01T16:52:24+05:30 IST

తాడిపత్రి (Tadipatri) నివురుగప్పిన గప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

నివురుగప్పిన నిప్పులా తాడిపత్రి

Ananthapuram : తాడిపత్రి (Tadipatri) నివురుగప్పిన గప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి (JC Prabhakar Reddy), డీఎస్పీ చైతన్య (DSP Chaitanya) మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాడిపత్రి డీఎస్పీ పోలీస్ స్టేషన్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే డీఎస్పీ చైతన్య రూ.లక్షల్లో మాత్రమే తీసుకుంటారని విమర్శించారు. అయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ డీఎస్పీ చైతన్య రివర్స్ అటాక్ చేశారు. మాటల యుద్ధం నేపథ్యంలో పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్షకు సన్నద్ధమయ్యారు. కౌన్సిలర్‌లతో కలిసి బ్లాక్ డ్రెస్‌తో దీక్షకు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్నద్ధమయ్యారు.  


Updated Date - 2022-10-01T16:52:24+05:30 IST