High tension: నారా లోకేష్ పర్యటన.. శ్రీకాకుళం జిల్లాలో హై టెన్షన్..

ABN , First Publish Date - 2022-08-21T16:11:27+05:30 IST

నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకాకుళం జిల్లాలో పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది.

High tension: నారా లోకేష్ పర్యటన.. శ్రీకాకుళం జిల్లాలో హై టెన్షన్..

శ్రీకాకుళం (Srikakulam): టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకాకుళం జిల్లాలో పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ (High tension) నెలకొంది. కొత్త రోడ్ జంక్షన్‌లో, పలాసలో భారీగా పోలీసులు మోహరించారు. పలాస టీడీపీ కార్యాలయం (TDP Office) ముట్టడికి వైసీపీ (YCP) శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆంక్షలు విధిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ (144 Section)  విధించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు. 


కాగా నారా లోకేష్ శ్రీకాకుళంలోకి ప్రవేశించారు. ఈ సందర్బంగా లోకేష్‌కు మాజీ మంత్రి కళా వెంకట్రావు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. లోకేష్ పలాస వెళ్తున్నారన్న నేపథ్యంలో.. పలాస పార్టీ కార్యాలయంలో ఉన్న గౌతు శిరీష, శివాజీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించవద్దంటూ నోటీసులిచ్చారు. వైసీపీ నేతలు ఏవైనా నిర్వహిస్తే తాము కూడా నిర్వహిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్ వద్ద రోడ్డుపైన పోలీసులు లారీలు అడ్డంగా పెట్టారు. గోపీనగర్ హైవేలో జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-08-21T16:11:27+05:30 IST