యాంత్రీకరణతో అధిక దిగుబడి

ABN , First Publish Date - 2021-06-19T05:24:14+05:30 IST

యాంత్రీకరణతో అధిక దిగుబడి

యాంత్రీకరణతో అధిక దిగుబడి
నరసన్నపేట : మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌

 - వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌

టెక్కలి : ఖరీఫ్‌ సీజన్‌లో యదలు వేసే రైతులు యాంత్రీకరణ పద్ధతులు ద్వారా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌ అన్నా రు. శుక్రవారం  కె.కొత్తూరు గ్రామంలో వరి సస్యరక్షణ పద్ధతులపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన  పాల్గొని మాట్లాడారు. ఆధునిక పద్ధతులతో యదలు సాగు చేస్తే చీడపీడల నుంచి రక్షణతోపాటు  సలుభంగా కలుపు నివారణ చేయవచ్చునన్నారు. అలాగే 50శాతం రాయితీతో పురుగు మందులు  ప్రభుత్వం అందిస్తున్నందన్నారు. అనంతరం 21మంది రైతులకు సబ్సీడీతో ఆయిల్‌ ఇంజిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మొర్రి శంకరరావు, ఆత్మ పీడీ కె.కృష్ణారావు, ఏడీ బీవీ తిరుమలరావు, ఏవో జి.రంగారావు, గోవిందరావు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


సీడ్‌ డ్రీల్‌తో ప్రయోజనం

నరసన్నపేట : వరి ఎదయ సాగులో మరింత దిగుబడి సాధించేందుక సీడ్‌డ్రిల్‌తో విత్తనాలు చల్లుకోవాలని వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌ సూచించారు. ఈ మేరకు శుక్రవారం తెలగవలస గ్రామంలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో వ్యవ సాయ ఆధునికీకరణ విఽధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్కువ విత్తనాలు వేయడం ద్వారా దిగుబడి తగ్గుతుందన్నారు. సీడ్‌ డ్రిల్‌ యంత్రాలను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచుతుందన్నారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ కె.కృష్ణారావు, ఏడీఏ రవీంద్రభారతి, ఏవో సునీత, రైతులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-19T05:24:14+05:30 IST