కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రితురాజ్‌ అవస్థి

Sep 19 2021 @ 11:37AM

బెంగళూరు: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రితురాజ్‌ అవస్థిని నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో ఆయన సీనియర్‌ న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కర్ణాటక రాష్ట్ర హైకోర్టులో తన సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రహైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన సీనియర్‌ న్యాయమూర్తి అరవింద కుమార్‌ గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అలాగే ఆర్‌వీ మళిమఠ్‌ హిమాచలప్రదేశ్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదా నుంచి పదోన్నతి పొందారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో సేవలందించిన ఏఎస్‌ ఓకాతోపాటు సీనియర్‌ న్యాయమూర్తి బీవీ నాగరత్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటక హైకోర్టుకు చెందిన పది మంది న్యాయమూర్తులను పర్మనెంట్‌ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన సంగతి విదితమే. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.