టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-06-02T09:19:38+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి కేటాయించిన 150 ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేస్తూ

టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి హైకోర్టులో ఊరట

- 150 ఎంబీబీఎస్‌ సీట్ల రద్దుపై స్టే 

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి కేటాయించిన 150 ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. ఎన్‌ఎంసీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏ అభిషేక్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం సుధీర్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కళాశాలలోని మౌలిక వసతులు, అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే వైద్య విద్య ప్రవేశాలకు ఎన్‌ఎంసీ అనుమతినిచ్చిందని టీఆర్‌ఆర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్‌ఎంసీ తరఫు న్యాయవాది గోరంట్ల శ్రీరంగ పూజిత వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీట్ల రద్దుపై ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కాలేజీ యాజమాన్యం దాఖలు చేసిన చట్టబద్ధమైన అప్పీల్‌పై తొలుత నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది. అప్పటి వరకు సీట్ల రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-06-02T09:19:38+05:30 IST