గిరిరాజ్‌ కళాశాలను సందర్శించిన ఉన్నత విద్య ఆర్‌జేడీ

ABN , First Publish Date - 2021-03-07T05:21:18+05:30 IST

జిల్లాకేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యా సం యుక్త సంచాలకులు కెప్టెన్‌ రాజేందర్‌సింగ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో మాట్లాడా రు.

గిరిరాజ్‌ కళాశాలను సందర్శించిన ఉన్నత విద్య ఆర్‌జేడీ
విద్యార్థుతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ రాజేందర్‌సింగ్‌

నిజామాబాద్‌అర్బన్‌, మార్చి 6 : జిల్లాకేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యా సం యుక్త సంచాలకులు కెప్టెన్‌ రాజేందర్‌సింగ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో మాట్లాడా రు. విద్యార్థులలో నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసే జిజ్ఞాస, యువరత్నం కార్యక్రమాల్లో విద్యార్థులు చు రుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. చక్కని ప్రణాళికతో పోటీ పరిక్షల్లో పాల్గొని మంచి భవిష్యత్‌ ను నిర్మించుకోవాలన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులను ఎదుక్కొనే విధంగా మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తికనబర్చాలన్నారు. కళాశాలలో వివిధ విబాగాలను పరిశీలించి న ఆయన విద్యార్థుల అభివృద్ధికి నిర్వహించే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశమై న్యాక్‌ సర్కీల్‌లో ఏగ్రేడ్‌ గుర్తింపు సాధించేవిధంగా అందరు కృషి చేయాలని ఆయన సూచించారు. కళాశాల సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌జేడితో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, సూపరిండెంట్‌ దీపక్‌, కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ, తదితరులు పా ల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:21:18+05:30 IST