కాలుష్యంతో భారత్‌లో అత్యధిక అకాల మరణాలు!

ABN , First Publish Date - 2022-05-19T07:59:33+05:30 IST

భారత్‌లో కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు చోటుచేసుకున్నాయని ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ తాజాగా వెల్లడించింది.

కాలుష్యంతో భారత్‌లో అత్యధిక అకాల మరణాలు!

2019లో కాలుష్యంపై లాన్సెట్‌ స్టడీ

23.5 లక్షలమంది మృతి చెందారని వెల్లడి

2వ స్థానంలో చైనా, 7లో అమెరికా

8 23.5 లక్షలమంది మృత్యువాత


న్యూఢిల్లీ, మే 18: భారత్‌లో కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు చోటుచేసుకున్నాయని ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ తాజాగా వెల్లడించింది. ఇవి ప్రపంచంలోనే అత్యధికమని పేర్కొంది. వీటిలో 6.1లక్షల మరణాలు గృహాల నుంచి వచ్చే కాలుష్యం వలన సంభవించాయని వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాలుష్యాలు కలిపి 90లక్షల అకాల మరణాలు 2019లో చోటుచేసుకున్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇది 55శాతం అధికం. ఇక నీటి కాలుష్యం వలన ప్రపంచవ్యాప్తంగా 13.6 లక్షలమంది కన్నుమూశారు. కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న నష్టాలు అపారంగా ఉన్నాయి. ఒక్క 2019లోనే అకాల మరణాల వలన కలిగిన నష్టం రూ. 3.5 కోట్ల కోట్లు. అయినప్పటికీ ఈ విషయానికి అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. భారత్‌లో ఉత్తర భారత రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో కాలుష్యం ఉంది. భారత్‌కు కాలుష్య నియంత్రణకు ఒక బలమైన కేంద్రీకృత యంత్రాంగ వ్యవస్థ లేదు’’ అని అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. జాబితాలో భారత్‌ తొలిస్థానంలో ఉండగా.. చైనా(22లక్షల మరణాలు) రెండవ స్థానంలో ఉంది.

Updated Date - 2022-05-19T07:59:33+05:30 IST