హైరిస్క్‌ కేసా... అయితే రెఫర్‌!

ABN , First Publish Date - 2021-09-29T05:45:39+05:30 IST

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో కేసుల రెఫర్‌ జోరందుకుంది. హైరిస్క్‌ కేసు అని తెలిస్తే నిమిషం కూడా ఆగకుండా ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేసేస్తున్నారు. దీంతో మాతాశిశు మరణాలు ఎక్కువయ్యాయి.

హైరిస్క్‌ కేసా... అయితే రెఫర్‌!
మదనపల్లె జిల్లా ఆస్పత్రి

ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్న వైనం


మదనపల్లె క్రైం, సెప్టెంబరు 28: జిల్లా ఆస్పత్రిలో కేసుల రెఫర్‌ జోరందుకుంది. హైరిస్క్‌ కేసు అని తెలిస్తే నిమిషం కూడా ఆగకుండా ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేసేస్తున్నారు. దీంతో మాతాశిశు మరణాలు ఎక్కువయ్యాయి. జిల్లా ఆస్పత్రికి మదన పల్లె డివిజన్‌తో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తుంటారు. రోజూ 800 నుంచి వెయ్యి వరకు ఓపీ ఉంటుంది. ఇన్‌పేషంట్లు 150మందికి పైగా ఉంటారు. రోజూ ఐదుకు పైగా ప్రసవాలు, సిజేరియన్లు జరుగుతుం టాయి. డివిజన్‌లో ఇదే పెద్దాస్పత్రి కావడంతో గర్భి ణులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం పొందేవరకూ అన్ని రకాల పరీక్షలతో పాటు స్కానింగ్‌ కోసం వస్తారు. పడమటి ప్రాంత మండలాల నుంచి వచ్చే గర్భిణుల్లో చాలా మంది  రక్తహీనతతో బాధపడుతు న్నారు. సంబంధిత సిబ్బంది ఐరన్‌మాత్రల పంపిణీ, ఐరన్‌సుక్రోజ్‌ ఇంజెక్షన్లు వేయడంలో నిర్లక్ష్యం వహి స్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. తీరా ఆస్పత్రికి కాన్పుకు వచ్చేసరికి బాధితుల్లో ఆరు నుంచి 10 గ్రాముల్లోపే రక్తం ఉంటోంది. దీన్ని హైరిస్క్‌ కేసుగా ముద్రవేసి ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం అందుబాటులో ఉన్నా... ఫలితం శూన్యం. గర్భిణిని అడ్మిట్‌ చేసి రక్తం ఎ క్కించి సిజేరియన్‌ చేయకుండా ప్రైవేటు ఆస్పత్రు లకు వెళ్లమని సలహా ఇస్తున్నట్టు విమర్శలు వినిపి స్తున్నాయి.  ఆరోగ్యశ్రీ గుర్తింపు కలిగిన ఆస్పత్రులతో పాటు ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు జనం వాపోతున్నారు. రాత్రిపూట పురిటినొప్పులతో జిల్లా ఆస్పత్రికి వెళితే... డాక్టర్‌ అందుబాటులో ఉండరని, అదే ప్రైవేటుకు వెళితే అందరూ అందుబాటులో ఉండి తొందరగా సిజేరియన్‌ చేస్తారని  కుటుం బీకులకు సూచిస్తున్నారు. ప్రైవేటులో సాధారణ కాన్పు జరిగే అవకాశం ఉన్నా..బిడ్డ అడ్డం తిరిగిందని, బీపీ రేటు పెరగడంతో పాటు రక్తం తక్కువగా ఉందంటూ సిజేరియన్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. వారంరోజుల పాటు అక్కడే ఉంచుకుని రూ.20 వేల నుంచి రూ.30 వేలు బిల్లుతో ఇంటికి సాగనంపుతు న్నారు. జిల్లా ఆస్పత్రికి రాత్రిపూట వచ్చే గర్భిణులు నరకం అనుభవిస్తున్నారు. గైనిక్‌ వైద్యులు అందు బాటులో ఉండక పోగా, లేబర్‌రూంలో పనిచేసే వైద్యసిబ్బందే డాక్టర్ల అవతారమెత్తి కాన్పులు చేసే స్తున్నారు. ఒకవేళ కేసు సీరియస్‌ అయితే అప్పుడు మాత్రమే గైనిక్‌ వైద్యులకు సమాచారం అందిస్తు న్నారు. అంతలోపు పరిస్థితి విషమించి మరణించిన ఘటనలు ఉన్నాయి. గర్భిణుల బంధువులు డాక్టర్లపై తిరగబడి ధర్నాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో ముగ్గురు గైనిక్‌ వైద్యులు, ముగ్గురు అనస్థటిస్టులు ఉన్నారు. ఆస్పత్రిలో గతంలో 15 నుంచి 20 వరకు కాన్పులు, సిజేరియన్లు జరిగేవి. కేసుల రెఫర్‌తో ప్రస్తుతం ఐదుకు మించి జరగడం లేదు. ఆస్పత్రి తనిఖీకి వచ్చిన అధికారులు గైనిక్‌ వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తల పనితీరుపై మండిపడ్డారు. అయినా షరామామూలై పోయింది.  



కేసుల రెఫర్‌ తగ్గింది..

కరోనా నేపథ్యంలో కేసుల రెఫర్‌ ఉండేది. కొవిడ్‌ కేసులు తగ్గాక... రెఫర్‌ చేయడం తగ్గించాం. రోజూ ప్రసవాలు, సిజేరియన్లు జరుగుతున్నాయి. ఆస్పత్రికి వచ్చే గర్భిణికి అన్ని పరీక్షలు చేస్తున్నాం. బలమైన కారణం ఉంటే తప్పా కేసులను రెఫర్‌ చేయొద్దని గైనిక్‌ వైద్యులకు సూచించాం. డాక్టర్లు అందుబా టులో ఉన్నారు. కొందరు ప్రైవేటుకు వెళుతున్నారు. వారి అంగీకారం మేరకు రెఫర్‌ చేయాల్సి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నాయి. 

- కె.ఆంజనేయులు, మెడికల్‌ సూపరింటెండెంట్‌

Updated Date - 2021-09-29T05:45:39+05:30 IST