Hijra: మంగళసూత్రంతో హిజ్రా ధర్నా

ABN , First Publish Date - 2022-09-03T13:44:29+05:30 IST

మదురైలో తనను వివాహం చేసుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు మంగళసూత్రంతో ఓ హిజ్రా(Hijra) ధర్నా చేపట్టిన సంఘటన కలకలం రే

Hijra: మంగళసూత్రంతో హిజ్రా ధర్నా

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 2: మదురైలో తనను వివాహం చేసుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు మంగళసూత్రంతో ఓ హిజ్రా(Hijra) ధర్నా చేపట్టిన సంఘటన కలకలం రేపింది. మదురై కీల్‌చిన్నంపట్టి ప్రాంతానికి చెందిన హిజ్రా శ్రీనిధి(Hijra Srinidhi) ఆ ప్రాంతంలోని మారియమ్మన్‌ ఆలయ పూజారిగా వ్యవహరిస్తున్నారు. సోలవందాన్‌ ప్రాంతానికి చెందిన తంగదురైకు హిజ్రా శ్రీనిధికి కొన్నేళ్ల క్రితం ఈ ఆలయంలో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో, ఇటీవల మరో మహిళను తంగదురై(Thangadurai) వివాహం చేసుకొని తనను మోసం చేశాడని ఆరోపిస్తూ హిజ్రా అందజేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో, శుక్రవారం ఉదయం తంగదురై ఇంటి ముందు హిజ్రా ధర్నాకు దిగడం కలకలం రేపింది.

Updated Date - 2022-09-03T13:44:29+05:30 IST