ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ పాదయాత్ర

Published: Sun, 26 Jun 2022 00:55:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ పాదయాత్రపాదయాత్ర ప్రారంభిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 25: ఎస్‌సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్‌పీఎస్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ బచ్చలి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం మహాజన్‌ సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపిచినప్పటికీ బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఎస్‌సీ వర్గీకరణను వెంటనే చేయాలని, లేకపోతే జూలై 2న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాదయాత్ర మున్సిపల్‌ టీ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మంద రవికుమార్‌, పల్లె బాబు, రాజయ్య, మాతంగి కుమార్‌, కాంపెల్లి స్వామి, రాంబాబు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.