
న్యూయార్క్ : అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఆమె భర్త, ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కోవిడ్ నెగెటివ్ అని నిర్థరణ అయింది. ఆయన ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఈ వివరాలను హిల్లరీ క్లింటన్ ట్విటర్ వేదికగా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వెల్లడించారు.
హిల్లరీ క్లింటన్ (74) డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన ట్వీట్లలో, తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని, స్వల్పంగా జలుబు లక్షణాలు ఉన్నాయని, అయినప్పటికీ బాగానే ఉన్నానని తెలిపారు. ఈ తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తున్నందుకు వ్యాక్సిన్‌కు తాను మరింత ఎక్కువ కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకొననివారు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకొని, బలోపేతమవాలని కోరారు. బిల్ క్లింటన్‌కు కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నారు. ఆయన కూడా బాగానే ఉన్నారని తెలిపారు. తమ ఇంటిని పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు ఆయన క్వారంటైన్లో ఉంటారని చెప్పారు. ఏ సినిమాలను చూడాలో చెబితే సంతోషిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి