తండ్రి టీ దుకాణం దగ్గర ఆ కుర్రాడు చేసిన పని.. ఈ రోజు తల ఎత్తుకునేలా చేసింది.. హిమాంశు గుప్తా సక్సెస్ స్టోరీ

ABN , First Publish Date - 2021-12-12T17:24:11+05:30 IST

మనిషి ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని, దాని కోసం..

తండ్రి టీ దుకాణం దగ్గర ఆ కుర్రాడు చేసిన పని.. ఈ రోజు తల ఎత్తుకునేలా చేసింది.. హిమాంశు గుప్తా సక్సెస్ స్టోరీ

మనిషి ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని, దాని కోసం తీవ్రంగా పరితపించినప్పుడు, అందుకు అవసరమైన కృషి చేసినప్పుడు అతని ప్రయత్నం సఫలం అవుతుందని అంటారు. దీనిని నిజం చేశారు హిమాంశు గుప్తా. ఇతని కథ యువతకు ఒక ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. యూపీఎస్సీ పరీక్షార్థులకు స్పూర్తిగా నిలిచారు హిమాంశు గుప్తా. 


2019లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 304 ర్యాంకు సాధించిన హిమాంశు గుప్తా 2020లో జరిగిన సివిల్స్ పరీక్షలో 139వ ర్యాంకు సాధించారు. హిమాంశు గుప్తా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పరిధిలోగల శివారు ప్రాంతానికి చెందినవాడు కావడం విశేషం. తండ్రికి గల టీ దుకాణం దగ్గర కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ అతను కన్న కలలు సాకారం చేసుకున్నారు. హిమాంశు గుప్తా మూడుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. తొలిసారి రాసిన పరీక్షలో ఇండియన్ రైల్వే సర్వీస్‌లో అవకాశం లభించింది. రెండవ ప్రయత్నంలో ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. ముచ్చటగా మూడవ సారి చేసిన ప్రయత్నంలో ఐఎఎస్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హిమాంశు మాట్లాడుతూ సివిల్స్ పరీక్షల కోసం పెద్ద పెద్ద పట్టణాలు వెళ్లి కోచింగ్ తీసుకోవడం తప్పనిసరి కాదని, స్వయంగా కష్టపడినా విజయం సాధించవచ్చన్నారు. ఆన్‌లైన్ మాధ్యమంలో కోచింగ్ తీసుకోవడం ఉత్తమ నిర్ణయం అన్నారు. 

Updated Date - 2021-12-12T17:24:11+05:30 IST