హిందీ భాషపై మక్కువ పెంచుకోవాలి

Sep 15 2021 @ 01:43AM

రాయవరం, సెప్టెంబరు 14: జాతీయ భాషగా గుర్తింపు పొందిన హిందీ భాషపై విద్యార్థులు మక్కువ కలిగే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని విశ్రాంత లెక్చరర్‌ మల్లిడి దొరారెడ్డి పిలుపునిచ్చారు. రాయవరం శ్రీరామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హిందీ దివాస్‌ (జాతీయ హిందీ దినోత్సవం) నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయుడు పడాల సత్యనారాయణరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో దొరారెడ్డి, హెచ్‌ఎం పప్పు శ్రీనివాసరెడ్డి, పల్లంరాజు మాట్లాడారు.  పాఠశాల నుంచి హిందీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. హిందీ ఉపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డిను సత్కరించారు. కార్యక్రమంలో కె.రాజేష్‌, చౌదరి, రెహ్మాన్‌, అప్పారెడ్డి, శ్రీనివాస్‌, శ్రీవల్లి పాల్గొన్నారు.

మండపేట:  పట్టణంలో మంగళవారం హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జ్ఞానజ్యోతి హిందీ విశ్వ విద్యాలయం నిర్వాహకురాలు తాతవోలు పార్వతీదేవి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. వక్తృ త్వ పోటీల్లో విజేతలైన 70మంది విద్యార్థులకు బహుమతులు అందించారు. వైసీపీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి, కౌన్సిలర్‌లు శెట్టికళ్యాణి, పట్టణ వైసీపీ కన్వీనర్‌ ముమ్మిడివరపు బాపిరాజు, శెట్టి నాగేశ్వరరావు, పి.వీరబాబు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.